పత్తి రైతుల ఆందోళన
● సమయం దాటిందని కొనుగోలు చేయని సీసీఐ అధికారులు ● కలెక్టర్ చొరవతో రాత్రి 8 గంటలకు తిరిగి కొనుగోళ్లు
ఆదిలాబాద్‌టౌన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు మార్కెట్ యార్డుకు వచ్చిన అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. సాయంత్రం 6 గంటల తర్వాత సమయం దాటిందని సీసీఐ అధికారులు కొనుగోళ్లను నిలిపివేశారు. అధికారులను ప్రాధేయపడినప్పటికీ వినకుండా వెళ్లిపోయారు. దీంతో అన్నదాతలు ఆగ్రహానికి గురై ఆందోళనకు దిగారు. శనివారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు దాదాపు 1600లకు పైగా పత్తి వాహనాలు వచ్చాయి. సీసీఐ ధర తగ్గుతుందని సోషల్ మీడియాలో పుకార్లు రావడంతో రైతులు పెద్ద ఎత్తున పత్తి వాహనాలతో మార్కెట్ యార్డుకు వచ్చారు. ఇదిలా ఉండగా సాయంత్రం 5 గంటల వరకు కొనుగోలు చేసిన తర్వాత 200 వరకు పత్తి వాహనాలు మిగిలి ఉన్నాయి. సమయం దాటిందని, తాము కొనుగోలు చేయమని అధికారులు తెలిపారు. ఆందోళనకు దిగడంతో ఈ విషయం కలెక్టర్ రాజర్షిషా దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన చొరవ తీసుకొని రాత్రి 8 గంటల ప్రాంతంలో కొనుగోళ్లు పునఃప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment