చికిత్స పొందుతూ బాలుడు మృతి
ఇంద్రవెల్లి: విద్యుత్ షాక్‌తో గాయాలైన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై దుబ్బాక సునీల్ తెలిపారు. మండల కేంద్రంలోని భీంనగర్‌కు చెందిన మసురే సంతోష్, సుకేష్మ దంపతుల ఏకై క కుమారుడు మసురే వీరేందర్(13) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. నవంబర్ 7న పాఠశాలకు వెళ్లిన విద్యార్థి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి ఆడుతుండగా ఓ భవనంపై వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ తీగలను ముట్టుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా 44 రోజులపాటు చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజమున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment