● టీచర్లకు తాత్కాలిక ఎస్‌వో బాధ్యతలు ● 17 రోజులుగా సమ్మెలో సమగ్ర శిక్షా ఉద్యోగులు
తాత్కాలిక ప్రత్యేక అధికారులు వీరే..
మండలం పేరు
బేల సీహెచ్.అరుణ, ఎస్జీటీ, సిర్సన్న
భీంపూర్ జి.భారతి, ఎస్జీటీ, భీంపూర్
బోథ్ కృష్ణజ్యోతి, పీజీటీ, మోడల్ స్కూల్, బోథ్
ఇచ్చోడ ఆడె అంబికా, ఎస్జీటీ, ఎస్సీకాలనీ, ఇచ్చోడ
ఇంద్రవెల్లి సవిత, ఎస్‌ఏ, వాల్గొండ, ఇంద్రవెల్లి
జైనథ్ పి.విజయలక్ష్మి, టీజీటీ, మోడల్ స్కూల్, జైనథ్ ఆదిలాబాద్‌రూరల్ గంగాదేవి, ఎస్జీటీ, బంగారుగూడ
ఆదిలాబాద్‌అర్బన్ ఎస్‌ఏ, ఆర్పీఎల్, ఆదిలాబాద్
గాదిగూడ కల్పన, ఎస్జీటీ, లోకారి(కె)
నేరడిగొండ లీలావతి, ఎస్జీటీ, బోరెగాం(బి)
తలమడుగు(లింగి) టి.లలిత, ఎస్‌ఏ, జెడ్పీఎస్‌ఎస్, లింగి
బజార్‌హత్నూర్ తన్మీత్‌కౌర్, ఎస్‌ఏ, బుర్కపల్లె
గుడిహత్నూర్(తోషం) ఇందిరా, గుడిహత్నూర్ మోడల్ స్కూల్
నార్నూర్ రాథోడ్ పల్లవి, ఎస్జీటీ, ఉమ్రి
మావల జయశ్రీ, ఎస్జీటీ, భీంపూర్
ఆదిలాబాద్‌టౌన్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు విధులకు హాజరుకామని సమగ్ర శిక్షా ఉద్యోగులు భీష్మించుకు కూర్చున్నారు. పక్షం రోజులుగా సమ్మెలో ఉండడంతో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), యూఆర్‌ఎస్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల చదువులు కుంటుపడుతున్నాయి. పదోతరగతి, ఇంటర్ విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. తాత్కాలికంగా టీచర్లకు ప్రత్యేక అధికారులు (ఎస్‌వోలు)గా బాధ్యతలు అప్పగించారు. ఇందుకు సంబంధించి వారి వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. వీరితో పాటు ప్రతీ కేజీబీవీకి ఇద్దరు లేదా ముగ్గురు టీచర్లను నియమించనున్నట్లు సమాచారం. అయితే ఉపాధ్యాయులకు కేజీబీవీల్లో విద్యాబోధన చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయడాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కాగా ఉట్నూర్, తాంసి మండలాలకు సంబంధించిన ఎస్‌వోలను నియమించాల్సి ఉందని కేజీబీవీ సెక్టోరియల్ అధికారి ఉదయశ్రీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment