జైనథ్ ఆలయంలో హైకోర్టు జడ్జి పూజలు
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): హైకోర్టు జడ్జి డి.రమాకాంత్ గురువారం జైనథ్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ లక్ష్మీనారాయణస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. మహారాష్ట్రలోని తాడోబాకు కుటుంబ సమేతంగా వెళ్లిన ఆయన తిరుగు ప్రయాణంలో ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు సంపత్ కుమార్ ఆశీర్వచనాలు అందించి శాలువాతో సత్కరించారు. ఆలయ విశిష్టత గురించి వివరించారు.
పత్తి రైతుల ఆందోళన
బేల: సీసీఐ అధికారులు పత్తికి మద్దతు ధర రూ.7,521కంటే రూ.50 తగ్గించడంపై బేలలోని ఆశపుర జిన్నింగ్ ఎదుట 353బి జాతీయ రహదారిపై గురువారం రైతులు ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్‌లో చెల్లిస్తున్న ధరను ఇక్కడ చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఠాక్రే గంభీర్, సతీష్ పవార్, ప్రమోద్‌రెడ్డి, ఠాక్రే మంగేష్, దేవన్న, తేజ్‌రావు, విపిన్ రైతులకు మద్దతు తెలిపారు. సీసీఐ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ పూజ సంఘటన స్థలానికి చేరుకుని ఆదిలాబాద్‌లో ఇచ్చే ధరకే నాణ్యమైన పత్తిని కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment