గోదావరి జలాలతో తిరుగుపయనం
● కలమడుగుకు చేరుకున్న
మెస్రం వంశీయులు
● హస్తల మడుగులో పూజలు
జన్నారం: నాగోబా జాతర పురస్కరించుకుని నాగదేవతను గోదావరి జలాలతో అభిషేకించడం ఆనవాయితీ. ఏటా మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గోదావరి నది హస్తల మడుగు నుంచి జలాలు తీసుకెళ్తారు. ఇందుకోసం కేస్లాపూర్ నుంచి ఈ నెల 10న పాదయాత్రగా బయల్దేరిన మెస్రం వంశీయులు గురువారం రాత్రి జన్నారం మండలం నర్సింగపూర్ గ్రా మానికి చేరుకుని బసచేశారు. శుక్రవారం ఉదయం 7గంటలకు కలమడుగు గోదావరి నదికి చేరుకున్నా రు. హస్తలమడుగులో జలాలను తీసుకెళ్లే కలశం( ఝరి)లను శుభ్రం చేశారు. నదిలో స్నానాలు ఆచరించిన అనంతరం దంపుడు బియ్యం, ఇంటింటి నుంచి తీసుకొచ్చిన పప్పుతో భోజనం చేశారు. కలశంలో గోదావరి నీటిని నింపారు. దానిని కర్రకు కట్టి పూజలు చేశారు. అనంతరం వరుస క్రమంలో తిరుగు పయనమయ్యారు. ఈ నెల 20న కేస్లాపూర్‌కు చేరుకుంటామని కటోడ హన్మంతరావు, వంశీయులు మారుతి, తిరుపతి తెలిపారు. స్థానిక నాయకుడు మెస్రం రాజ్‌కుమార్ వారి వెంట ఉండి ఏర్పాట్లు చూశారు.
రిమ్స్‌లో కలెక్టర్ తల్లిదండ్రులకు వైద్యపరీక్షలు
ఆదిలాబాద్‌టౌన్: కలెక్టర్ రాజర్షి షా తల్లిదండ్రులు అమిత షా, బికే.షాలకు రిమ్స్ వైద్యులు శుక్రవారం వైద్యచికిత్స అందించారు. కలెక్టర్ తండ్రి దంత, నేత్ర సమస్యలతో బాధపడుతుండగా సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు. తల్లికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ స్వయంగా దగ్గరుండి వారికి చికిత్స అందించారు.
Comments
Please login to add a commentAdd a comment