‘పంచాయతీ’ గుర్తులు ఖరారు | - | Sakshi
Sakshi News home page

‘పంచాయతీ’ గుర్తులు ఖరారు

Published Mon, Jan 20 2025 12:31 AM | Last Updated on Mon, Jan 20 2025 12:31 AM

‘పంచా

‘పంచాయతీ’ గుర్తులు ఖరారు

● సర్పంచులకు 30.. వార్డుసభ్యులకు 20 ● బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ కసరత్తు షురూ ● మొదలైన బాక్సుల మరమ్మతులు

కైలాస్‌నగర్‌: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్‌ విడుదల చేసినా విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఓటర్ల జా బితా, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు చేపట్టిన యంత్రాంగం తాజాగా అభ్యర్థులకు కేటాయించనున్న గుర్తులను ఖరారు చేసింది. సర్పంచ్‌ అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాటికి అనుగుణంగా జిల్లా స్థాయిలో బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు అధికారులు చర్యలు చేపట్టారు.

అనువైన గుర్తులు..

సర్పంచ్‌, వార్డుసభ్యుల ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తెలిసిన గుర్తులను కేటాయించారు. సర్పంచ్‌ బ్యాలెట్‌ పత్రం గులాబీ రంగులో ఉండగా, వార్డు సభ్యులది తెలుపు రంగులో ఉండేలా ఈ గుర్తులను ముద్రించనున్నారు.

సర్పంచ్‌ బ్యాలెట్‌లో గుర్తులు

బ్యాట్‌, బ్యాట్స్‌మెన్‌, స్టంప్స్‌, ఉంగరం, కత్తెర, ఫుట్‌బాల్‌, లేడీ పర్స్‌, టీవీ రిమోట్‌, టూత్‌పేస్ట్‌, పాన, చెత్తడబ్బా, బ్లాక్‌బోర్డ్‌, బెండకాయ, కొబ్బ రితోట, డైమండ్‌, బకెట్‌, డోర్‌ హ్యాండిల్‌, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్‌, బ్యా టరీలైట్‌, బ్రష్‌, పడవ, బిస్కెట్‌, వేణువు, చైన్‌, చెప్పులు, గాలిబుడగ వంటి గుర్తులు ఉంటాయి.

వార్డు సభ్యుల బ్యాలెట్‌లో ఇలా..

గౌను, గ్యాస్‌స్టౌ, స్టూల్‌, సిలిండర్‌, బీరువా, ఈల, కుండ, డిష్‌ యాంటినా, గరాట, మూకు డు, ఐస్‌క్రీమ్‌, గాజుగ్లాస్‌, పోస్టుడబ్బా, కవర్‌, హాకీ కర్రబంతి, నెట్‌, కటింగ్‌ ప్లేయర్‌, బాక్స్‌, విద్యుత్‌ స్తంభం, కేతిరి గుర్తులు ఉంటాయి.

బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు సర్వం సిద్ధం..

పంచాయతీ ఎన్నికల్లో వినియోగించే బ్యాలెట్‌ పేపర్ల ముద్రణను జిల్లా స్థాయిలోనే చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈమేరకు యంత్రాంగం సిద్ధం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 12 మంది ప్రింటర్లు దరఖాస్తు చేసుకోగా, వారికి బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్యామలా దేవి ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్‌ జరగగా, అధికారికంగా సోమవారం ప్రకటించే అవకాశం ఉంది.

నోటా కూడా..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు నచ్చకుంటే వారిని తిరస్కరించే అవకాశాన్ని ఓటర్లకు ఈసీ కల్పించింది. బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు నోటా గుర్తును బ్యాలెట్‌ పేపర్‌పై ముద్రించనున్నారు. పోటీలో ఇద్దరు అభ్యర్థులు ఉంటే వారితో పాటు మూడో గుర్తుగా నోటాను ముద్రించనున్నారు.

అన్నివిధాలా సంసిద్ధం..

పంచాయతీ ఎన్నికలను జిల్లాలో పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈసీ ఎప్పుడు నోటఫికేషన్‌ జారీ చేసినా విజయవంతంగా నిర్వహించేలా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఓటరు జాబితాను ప్రకటించడంతో పాటు బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ టెండర్లను ఖరారు చేశాం. బాక్సులకు మరమ్మతులు చేయిస్తున్నాం. ఈ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

– శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
‘పంచాయతీ’ గుర్తులు ఖరారు1
1/2

‘పంచాయతీ’ గుర్తులు ఖరారు

‘పంచాయతీ’ గుర్తులు ఖరారు2
2/2

‘పంచాయతీ’ గుర్తులు ఖరారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement