టీబీ నియంత్రణకు కృషి చేయాలి
ఆదిలాబాద్: టీబీ నియంత్రణకు కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో నిక్షయ్ పథకానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షయపై అవగాహన ఉంటేనే నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ఈ దిశగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సా రించాలని సూచించారు. 100 రోజుల నిక్షయ్ శిబిర్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో భాగంగా నమోదైన కేసుల వివరా లను అధికారులు అడిగి తెలుసుకున్నా రు. అలాగే డ్రోన్ సాయంతో మందులను ఏ వి ధంగా పంపిణీ చేస్తున్నారో అధికారులు ఎ మ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, డీటీసీవో సుమలత, సాయి ప్రియ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment