హాలో.. నేను కలెక్టర్‌ను మాట్లాడుతున్న
● ‘పది’ విద్యార్థుల తల్లిదండ్రులతో టెలీకాన్ఫరెన్స్ ● పరీక్షలయ్యే వరకు ఇతర పనులు చెప్పవద్దని హితవు
కై లాస్‌నగర్: ‘హలో.. నేను కలెక్టర్‌ను మాట్లాడుతున్న.. మీ పాప/బాబు ఎలా చదువుతున్నారు.. బాగా ప్రిపేర్ అవుతున్నారా.. ఇంట్లో ఎలా ఉంటా రు.. పరీక్షలయ్యే వరకు వారికి ఎలాంటి పనులు చెప్పకండి.. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నా.. మీ పిల్లలను కూడా నా లా కలెక్టర్‌ను చేసేలా చదివించండి.. వారు ఆ రోగ్యంగా ఉండేలా చూడండి..’ అంటూ కలెక్టర్ రాజర్షి షా పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. పది పరీక్షల సన్నద్ధతపై ప్రభుత్వ యాజమాన్యాల ఉన్నత పాఠఽశాలల విద్యార్థుల తల్లిదండ్రులతో శనివారం తన క్యాంప్ కార్యాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంచి ఫలితాలు సాధించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే నెలన్నర రోజులు విద్యార్థులకు ఇతర పనులేవీ చెప్పకుండా చదువుపైనే దృష్టి సారించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఉదయం 5గంటలకు నిద్ర లేపి చదివించడంతో పాటు టీవీ, మోబైల్, ఇంటర్‌నెట్‌కు దూరంగా ఉండేలా చూడాలన్నారు. ఇంట్లో ఒత్తిడికి లోను కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ప్రశాంతంగా చదివి అత్యుత్తమ గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధిస్తే బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించవచ్చన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. కార్యక్రమంలో డీఈవో ప్రణీత, డీసీఈబీ సెక్రెటరీ గజేందర్, ఆరో గ్య పాఠశాల కోఆర్డినేటర్ అజయ్ పాలొన్నారు.
ఆరోగ్య పాఠశాలగా తీర్చిదిద్దాలి
కై లాస్‌నగర్: విద్యార్థుల్లో మార్పు కోసమే ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు పాఠశాలల ప్రాధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్టూడెంట్ చాంపియన్లతో కార్యక్రమ అమలుపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య పాఠశాల ద్వారా విద్యార్థుల్లో వచ్చిన మార్పులను 44 ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన స్టూడెంట్ చాంపియన్ విద్యార్థులు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం వారికి కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. సమావేశంలో డీఈవో ప్రణీత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment