సర్వర్ డౌన్
● మధ్యాహ్నం వరకు నిలిచిన రిజిస్ట్రేషన్లు
కై లాస్‌నగర్: రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్ రెండు రోజులుగా మొరాయిస్తోంది. రాష్ట్రస్థాయిలో తలెత్తిన సాంకేతిక సమస్యలతో సర్వర్‌డౌన్ అవుతుంది. ఫలితంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతోంది. శనివారం మధ్యాహ్నం 3గంటల వరకు ఇదే సమస్య. దీంతో నిత్యం క్రయ విక్రయదారులతో సందడిగా కనిపించే జిల్లా కేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం బోసిపోయింది. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు గంటల తరబడి పడిగాపులు తప్పని పరిస్థితి. రెండు రోజులుగా రిజిస్ట్రేషన్ కోసం నిరీక్షిస్తున్నామని భీంపూర్ మండలం అర్లి(టి) గ్రామానికి చెందిన దేవురావు కుటుంబీకులు వాపోయారు. కాగా, మధ్యాహ్నం 3గంటల సమయంలో సమస్య పరిష్కారం కావడంతో రిజిస్ట్రేషన్లు యథావిధిగా ప్రారంభమయ్యాయి. శనివారం 40 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు సబ్ రిజిస్ట్రార్ విజయ్‌కాంత్ రావు తెలిపారు. రాష్ట్రస్థాయిలో తలెత్తిన కారణంగానే సర్వర్ డౌన్ అయినట్లుగా ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment