ప్రశాంతంగా ‘నవోదయ’ పరీక్ష
ఆదిలాబాద్‌టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం శనివారం నిర్వహించిన పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. జిల్లా కేంద్రంలో మూడు, ఉ ట్నూర్, బోథ్‌లో ఒక్కోటి చొప్పున పరీక్ష కేంద్రాల ను ఏర్పాటు చేశారు. మావల సమీపంలోని చావరా అకాడమీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో 240 మందికి గాను 192 మంది హాజరయ్యారు. అలాగే జిల్లా కేంద్రంలోని లిటిల్‌ఫ్లవర్ పాఠశాలలో 192కు గాను 150 మంది, ప్రభుత్వ బాలికల పాఠశాలలో 204 మందికి గాను 158 మంది హాజరయ్యారు. ఇక బోథ్‌లోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌లో 271 మందికి గాను 230 మంది, ఉట్నూర్‌లోని పూలాజీబాబా పరీక్ష కేంద్రంలో 263 మందికి గాను 232 మంది హాజరైనట్లు డీఈవో ప్రణీత తెలిపారు. మొత్తం 1,170 మందికి గాను 962 మంది హాజరు కాగా, 208 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను డీఈవోతో పాటు పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, నవోదయ విద్యాలయ అధికారులు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment