![కళాకారుల డిమాండ్లు అసెంబ్లీలో ప్రస్తావిస్తా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11nrl56-340151_mr-1739300026-0.jpg.webp?itok=VYZm-sJr)
కళాకారుల డిమాండ్లు అసెంబ్లీలో ప్రస్తావిస్తా
● నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్‌టౌన్: అసెంబ్లీ సమావేశాల్లో కళాకారుల డిమాండ్లను ప్రస్తావించి పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో తెలంగాణ సాంస్కృతిక కళా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కళా ఉత్సవం అవార్డు ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కళాకారులకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ఆ ప్రభుత్వం తోవలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళాకారులను తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కళాకారులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హరినాయక్, ఒడిసెల అర్జున్, సుంకరి సాయి, కళా సంస్థ అధ్యక్షురాలు పాట రాజశ్రీ, జిల్లా అధ్యక్షుడు దిగంబర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్, కళాకారులు పసుల రవి, మాడ సతీశ్, మగ్గిడి సురాజ్, జానా అజయ్, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment