![రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11adi401-604886_mr-1739300121-0.jpg.webp?itok=SyunBefP)
రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి
● మార్కెటింగ్‌శాఖ అదనపు డైరెక్టర్ రవికుమార్
ఆదిలాబాద్‌టౌన్: రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ అదనపు డైరెక్టర్ రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డును మంగళవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి కొనుగోళ్లకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. అనంతరం మార్కెటింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో సీసీఐ ద్వారా ఎంతమేర పత్తి కొనుగోళ్లు చేపట్టారు.. ప్రైవేట్ వ్యాపారులు ఎంత కొనుగోలు చేశారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం సాంకేతిక సమస్యతో దేశవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయినట్లు తెలిపారు. మంగళవారం ప్రైవేట్ వ్యాపారులు వేలం ద్వారా పత్తి క్వింటాలుకు రూ.6,930 ధర నిర్ణయించగా, వేలం ప్రక్రియను పరిశీలించారు. అనంతరం కందుల కొనుగోళ్లను పరిశీలించి రైతుల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మార్కెటింగ్ ఏడీ గజానంద్, కార్యదర్శులు మధుకర్, శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment