● వరంగల్ రీజియన్‌లో ఏడుగురిపై వేటు ● సీసీఐ కొనుగోళ్లపై ఆరా.. టీఆర్‌లో తేడాలే కారణం
వరంగల్: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై వరంగల్ రీజియన్‌లోని ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర మార్కెటింగ్ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. (సీసీఐ) పత్తి కొనుగోళ్ల కోసం జారీ చేసిన టెంపరరీ రిజిస్ట్రేషన్(టీఆర్)లో తేడాలు గుర్తించిన అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్‌కు గు రైన వారిలో ఆదిలాబాద్, చెన్నూర్, పెద్దపల్లి, వరంగల్, జనగామ, భద్రాచలం, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మార్కెట్ కార్యదర్శులు ఉన్నట్లు వరంగల్ రీ జియన్ జేడీఎం ఉప్పుల శ్రీనివాస్ తెలిపారు. వ్యవసాయ అధికారులు జారీ చే సిన ధ్రువీకరణ పత్రాల్లో, మార్కెట్ జారీ చేసిన టీఆర్‌లో తేడాలు ఉన్నట్లు గు ర్తించిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.నిర్మల, జనగామ మార్కెట్ కార్యదర్శిశ్రీనివాస్‌సస్పెన్షన్‌కు గురైనట్లు ఆయన పేర్కొన్నారు.
పెద్ద మొత్తంలో కొనుగోళ్లు..
ప్రస్తుత సీజన్‌లో దళారులు రైతుల పేరుతో పెద్ద మొత్తంలో పత్తిని తీసుకొచ్చి సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో అఽధికారులు రాష్ట్రంలోని మార్కెట్ కమిటీల వారీగా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. గతేడాదికంటే రెట్టింపుగా ఈఏడాది సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు జరగడంతో ఫిర్యాదులకు బలం చేకూరింది. పత్తి సాగు చేసిన సమయంలోనే ఆయా మండలాల్లోని వ్యవసాయ అధికారులతో రైతులు తమపేర్లను నమోదు చేసుకోవాలి. విషయం తెలియని పత్తి రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకునేందుకు సంబంధిత ఏఓలతో ధ్రువీకరణ పత్రాలు పొంది మార్కెట్‌కు వస్తే టెంపరరీ రిజిస్ట్రేషన్(టీఆర్)లను మార్కెట్ అధికారులు జారీ చేస్తారు. ఈ టీఆర్‌ల ప్రకారం సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తుంది.
వెసులుబాటే ఆసరాగా..
ఈ సీజన్‌లో మార్కెటింగ్ శాఖ టీఆర్‌ల జారీ అధికారం మార్కెట్ కార్యదర్శులకు అప్పగించినట్లు తెలిసింది. ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకున్న దళారులు ఇతర జిల్లాల నుంచి పత్తిని కొనుగోలు చేసి ఇక్కడ జారీ చేసిన టీఆర్‌లలో విస్తీర్ణం నమోదు చేసి మార్కెట్ అధికారులను తప్పుదోవ పట్టించినట్లుగా తెలిసింది. విషయం సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో డాటా ఎంట్రీ చేసిన సిబ్బంది గుర్తించినప్పటికీ దళారులతో కుమ్మకై ్కనందునే ఈదందా కొనసాగినట్లుగా తెలుస్తోంది. ఈకారణంగా మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటుపడినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment