![ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11adi54-340043_mr-1739300187-0.jpg.webp?itok=0PbbOXmV)
ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని దేవి ఫ్యామిలీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సో మవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఉట్నూర్‌కు చెందిన పెందూర్ ఉషారాణి అక్కడికి భోజనం చేసేందుకు వెళ్లగా, మంచూరియాలో కుళ్లిన వాసన రావడంతో డయల్ 100కు ఫోన్ చేశారు. విషయాన్ని పోలీసులు స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం అందించారు. దీంతో ఫుడ్‌సేఫ్టీ అధికారి డాక్టర్ శ్రీధర్‌తో పాటు శానిటరి ఇన్‌స్పెక్టర్ నరేందర్ హోటల్‌కు వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఆరు నమూనాలను సేకరించారు. వాటిని ల్యాబ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment