![చుక్కలదుప్పిపై వీధికుక్కల దాడి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11mcl53-340061_mr-1739300058-0.jpg.webp?itok=n2-anrvC)
చుక్కలదుప్పిపై వీధికుక్కల దాడి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): వనం నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఓ చుక్కలదుప్పిపై వీధికుక్కలు దాడిచేయడంతో గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం ముల్కల్ల అటవీ బీట్ పరిధి నుంచి చుక్కలదుప్పి గుడిపేట గ్రామ శివారులోని ఎస్సీ కాలనీలోకి ప్రవేశించింది. కాలనీలోని వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. గమనించిన స్థానికులు వాటి బారి నుంచి కాపాడి అటవీ అధికారులకు సమాచారం అందించారు. పాతమంచిర్యాల అటవీ బీట్ సెక్షన్ అధికారి అతావుల్లా, బీట్ అధికారి రాజేందర్ గ్రామానికి చేరుకుని దుప్పి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వైపు వెళ్లేలా చేశారు. ఇటీవల కరీంనగర్ నుంచి తీసుకువచ్చి హాజీపూర్ మండలం గఢ్‌పూర్ పంచాయతీ పరిధిలోని జంగల్ సఫారీలోకి వదిలి పెట్టిన చుక్కలదుప్పిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment