గ్రామాల్లో దాహార్తికి చెక్‌ | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో దాహార్తికి చెక్‌

Published Tue, Apr 23 2024 8:40 AM

గ్రామంలో కుళాయి వద్ద నీరు పట్టుకుంటున్న మహిళలు(నేడు) 
 - Sakshi

జి.మాడుగుల: గిరిజన ప్రాంతాల్లో మహిళలు టీడీపీ ప్రభుత్వ హయాంలో బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్లు కొలది కాలినడక వెళ్లి ఊటగెడ్డలు, పారుగెడ్డలను ఆశ్రయించే వారు. కలుషితమైన నీటితో అవసరాలు తీర్చుకొని రోగాల బారిన పడుతుండేవారు. దీంతో గిరిజనులు రోగాల మంచాన్న పడి పరిస్థితి విషమించి మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. బావుల్లో, ఊటగెడ్డలో భూగర్భజలాలు ఇంకిపోయి గిరిజనులు తాగునీటి కోసం అల్లాడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మన్యంలోని ఏ గ్రామంలో ఒక్క వాటర్‌ ట్యాంకు నిర్మించిన దాఖలాలు లేవు. ఏళ్ల తరబడి తాగునీటి కోసం గిరిజనులు నానా అవస్థలు పడ్డారు. అదంతా గతం.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన్య ప్రాంతాభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసింది. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించింది. ఏళ్ల తరబడి ఉన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది. గతంలో మాదిరిగా నీటి కోసం మండుటెండంలో కిలోమీటర్లు దూరం వెళ్లాల్సిన దుస్థితికి చెక్‌ చెప్పింది. ఇంటింటికీ కుళాయి అందజేయడంతో గిరిజనులు జగనన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెంటే అండగా జీవితాంతం ఉంటామని చెబుతున్నారు.

కోట్ల రూపాయల నిధులు

జి.మాడుగుల మండలంలో విడతల వారీగా తాగునీటి పథకాలు, ఇంటింటికీ కుళాయి పనులు జరిగాయి. ఇందులో భాగంగా మొదటి విడుతలో 327 పనులకు రూ. రూ.10.56కోట్లు మంజూరు కాగా అన్ని పనులు పూర్తయ్యాయి. రెండో విడుతగా 194పనులకు రూ.13.60కోట్లు మంజూరు కాగా, ఇందులో 105 పనులు పూర్తికాగా, రూ.6.26కోట్లు చెల్లింపులయ్యాయి. మరో విడతగా రూ.3.60 కోట్లు మంజూరు కాగా ఆయా పనులకు టెండర్లు పూర్తి కావడంతో పనులు చేపట్టాల్సి ఉంది. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. 234 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉండటంతో 93 గ్రామాల్లో తాగునీటి పథకాలు నిర్మాణాలను జగనన్న ప్రభుత్వం చేపట్టింది. ఇంటింటికి తాగునీటి సదుపాయం కల్పించింది. మిగతా గ్రామాల్లో తాగునీటి పథకాలు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.మంచినీటి పథకాలు పూర్తి స్థాయిలో అందుబాటులోని రానున్నాయి. వేసవిలో ఏ గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పీవీటీజీ గ్రామాలు అన్నిటికీ తాగునీటి సౌకర్యం అందుబాటులోనికి వచ్చింది. వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా సమ్మర్‌ క్రాస్‌ ప్రొగ్రామ్‌–2024టూర్‌ షెడ్యూల్‌ నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో బోర్లు మరమ్మతు పనులు చేపడుతారు.

లక్షలాది రూపాయలతో

తాగునీటి పథకాలు నిర్మాణం

ఇంటింటికీ కుళాయి

తీరిన తాగునీటి కష్టాలు

ఆనందంలో గిరిజనులు

తాగునీటి కోసం ఊటగెడ్డకు వెళ్తున్న
గిరిజన మహిళలు(నాడు)
1/2

తాగునీటి కోసం ఊటగెడ్డకు వెళ్తున్న గిరిజన మహిళలు(నాడు)

సంగులోయలో రక్షిత తాగునీటి పథకం
2/2

సంగులోయలో రక్షిత తాగునీటి పథకం

Advertisement
Advertisement