వీణా పుస్తక ధారిణి.. వందే అక్షర రూపిణి
సాక్షి,పాడేరు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. పాడేరులోని రాజరాజేశ్వరి,సంగోడిలోని పార్వతీదేవి,వంతాడపల్లిలోని కామాక్షమ్మ,ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులోని కనకదుర్గమ్మతల్లి,అరకులోయ పట్టణంలోని భ్రమరాంబదేవిలను సరస్వతీదేవిగా అలంకరించి అర్చకులు కుంకుమార్చన చేశారు. రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు సాముహికంగా అక్షరాభ్యాసాలు నిర్వహించారు.సర్పంచ్ కొట్టగుళ్లి ఉషారాణి,ఆలయ ధర్మకర్తమండలి సభ్యుడు కొట్టగుళ్లి సుబ్బారావు, ఇతర ఆధ్మాత్మిక కమిటీ ప్రతినిధులు చిన్నారులకు పలకలు,పుస్తకాలు పంపిణీ చేశారు.అరకులోయలోని మల్లికార్జున సమేత భ్రమరాంబదేవి ఆలయంలోను సరస్వతీదేవికి పూజలు చేయడంతో పాటు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సరస్వతీదేవి వేషధారణలో కావ్యశ్రీ అనే బాలిక అలరించింది.
Comments
Please login to add a commentAdd a comment