అర్హులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు
సాక్షి, పాడేరు: జిల్లాలో అర్హులైన రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేయాలని కలెక్టర్ ఎ.ఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. ఐటీడీఏ పీవోలు, జిల్లా వ్యవసాయ, ఉద్యానవనశాఖ, సెరీ కల్చర్, కాఫీ బోర్డు, స్పైసెస్ బోర్డు అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాఫీ, జీడి, రబ్బరు తోటలు, మిరియాల సాగుతో రైతులు పొందుతున్న ఆదాయం, మార్కెటింగ్ సదుపాయం, గిట్టుబాటు ధరలపై సమీక్షించారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందించడానికి అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు బ్యాంకు లింకేజీ అందించాలని సూచించారు. రంపచోడవరం డివిజన్ పరిధిలో 34 వేల మంది రైతులు 64 వేల ఎకరాల్లో జీడి తోటలు, 3,180 ఎకరాల్లో జాఫ్రా తోటలు పెంచుతున్నారుని చెప్పారు. 3 వేల మంది రబ్బరు సాగుచేస్తున్నట్టు చెప్పారు. రైతు ఉత్పత్తిదారులు సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతు ఉత్పత్తుల విక్రయాలకు డిజిటల్ తూనిక యంత్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ మాట్లాడుతూ 1.9 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నారని 75 వేల మెట్రిక్ టన్నుల కాఫీ పళ్లు దిగుబడులు వస్తున్నాయన్నారు. గత ఏడాది కాఫీ రైతులకు కాఫీ పళ్లు కిలోకు రూ.43 చెల్లించామని, అదనంగా మరో మూడు రూపాయలు బోనస్‌గా అందిస్తున్నామని చెప్పారు. ఈఏడాది రెండు వేల టన్నుల కాఫీ పళ్లు సేకరణ లక్ష్యంగా నిర్ధేశించామని తెలిపారు. నాణ్యమైన కాఫీ పళ్లు సరఫరా చేసేలా లైజన్ వర్కర్ల ద్వారా కాఫీ రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పామాయిల్ తోటలు సాగుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఈసమావేశంలో రంపచోడవరం ఐటీడీఏ పీవో కె.సింహాచలం, చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్. నంద్, జల్లా ఉద్యానవనశాఖ అధికారి రమేష్‌కుమార్ రావు, కాఫీ బోర్డు డీడీ రమేష్, స్పైసెస్ బోర్డు సీనియర్ క్షేత్ర అధికారి బి.కల్యాణి, జీసీసీ డీఎంలు సింహాచలం, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment