40 మద్యం దుకాణాలకు 591 దరఖాస్తులు
పాడేరు : జిల్లా వ్యాప్తంగా కేటాయించిన 40 మద్యం దుకాణాల కోసం ఇప్పటి వరకు 591 దరఖాస్తులు అందినట్టు విశాఖపట్నం ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ మహేష్‌కుమార్ తెలిపారు. స్థానిక ఎకై ్సజ్ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. మద్యం దుకాణాల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని పాడేరు, అరకులోయ, చింతపల్లి, రంపచోడవరం, చింతూరు ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 40 మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. ఇప్పటి వరకు పాడేరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 116 దరఖాస్తులు రాగా, అరకువేలిలో 76, చింతపల్లిలో 76, రంపచోడవరంలో 11, చింతూరు పరిధిలో 221 దరఖాస్తులు అందాయన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం తొలుత ఈనెల 9వరకే సమయమిచ్చిందని కానీ దరఖాస్తులదారుల విజ్ఞప్తి మేరకు ఈనెల 11 వరకు పొడిగించినట్టు చెప్పారు. పాడేరు స్టేషన్ పరిధిలోని పెదబయలుకు కేటాయించిన రెండు మద్యం దుకాణాలకు ఇప్పటి వరకు కేవలం రెండు దరఖాస్తులు రాగా, జి.మాడుగులలో కేటాయించిన రెండు మద్యం దుకాణాలకు మూడు దరఖాస్తులు వచ్చాయన్నారు. గిరిజన ప్రాంతంలో ఎక్కడా బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు ప్రస్తుతం ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదన్నారు. దరఖాస్తు చేసుకునేందు కు మరో రెండు రోజులు గడువు ఉందని చెప్పా రు. పాడేరు వీఆర్ కల్యాణ మండపంలో 14వ తేదీ ఉదయం 7గంటల నుంచి లాటరీ విధానం ద్వారా షాపులను కేటాయిస్తామని 16 నుంచి కొత్త మద్యం దుకాణాలు తెరుచుకుంటాయని తెలిపారు. జిల్లాలో కేవలం ఎస్టీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ ఇన్‌చార్జి సీఐ రాజారావు పాల్గొన్నారు.
ఈనెల 11 వరకు గడువు
ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ మహేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment