అనారోగ్యంతో శిశువు మృతి | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో శిశువు మృతి

Published Thu, Oct 10 2024 3:00 AM | Last Updated on Thu, Oct 10 2024 3:00 AM

అనారోగ్యంతో శిశువు మృతి

అనారోగ్యంతో శిశువు మృతి

పెదబయలు: జిల్లాలో శిశు మరణాలు ఆగడం లేదు. ఎక్కడో చోట అనారోగ్యంతో శిశువులు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా పెదబయలు పీహెచ్‌సీ పరిధిలోని లక్ష్మీపేట పంచాయతీ కిలుములు గ్రామానికి చెందిన కోరాబు సూర్యనారాయణ,సౌజ న్య దంపతుల కుమార్తె (3నెలలు) మృతి చెందింది. మూడు రోజుల నుంచి దగ్గు,జలుబుతో పాటు కడుపు ఉబ్బి పాప బాధపడుతోంది. తల్లిదండ్రులు ఈనెల 8న ముంచంగిపుట్టు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.అక్కడ ఒక్క రోజు చికిత్స అనంతరం కేజీహెచ్‌కు బుధవారం తరలిస్తుండగా మార్గమధ్యంలో శిశువు మృతి చెందింది. మూడు రోజుల నుంచి పాపకు ఆరోగ్యం బాగోలేకపోయినాస్థానిక ఆశ కార్యకర్త, ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ పట్టించుకోదని బంధువులు ఆరోపించారు. ఈవిషయంపై లక్ష్మీపేట ఏఎన్‌ఎం సుమలతను వివరణ కోరగా 8తేదీన కిలుములు, బల్లపురాయి,మొండికోట,కుడాసింగి గ్రామాల్లో 104 వాహనం ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, అక్కడ పాప అనారోగ్యంతో బాధపడుతున్నట్టు గుర్తించి ఆస్పత్రికి తరలించిన ట్టు చెప్పారు.సౌజన్యకు ఇంతకు ముందు కాన్పులో రెండేళ్ల కిందట పుట్టిన బా బు మూడు నెలల వయస్సులో మృతిచెందినట్టు బంధువులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement