No Headline
మణిపూర్ రాష్ట్రంలో సంప్రదాయ క్రీడగా విశేష ఆదరణ పొందిన థాంగ్ టా మార్షల్ ఆర్ట్స్‌పై జిల్లా యువత ఆసక్తి చూపుతోంది. జిల్లా కేంద్రమైన పాడేరులో రెండు రోజుల పాటు నిర్వహించిన అంతర్ జిల్లా పోటీల్లో జిల్లాకు చెందిన యువతీ యువకులు ప్రతిభ కనబరిచారు. ఈ క్రీడలో రాణించాలంటే క్రమశిక్షణ, చిత్తశుద్ధి, మంచి అలవాట్లు అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా అమ్మాయిల ఆత్మరక్షణకు దోహదపడటమే కాకుండా ఎలాంటి పరిస్థితులను అయినా దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని వారు అభిప్రాయపడ్డారు. విశాఖలో ఖేల్ ఇండియా ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment