104 నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే చేపట్టాలి
సిబ్బంది వినతి
ముంచంగిపుట్టు: 104 నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టాలని ఆ సంస్థ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని ఉమ్మడి విశాఖ జెడ్పీ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎంపీపీ అరిసెల సీతమ్మను గురువారం కలిసి అందజేశారు. ఈ సందర్భంగా 104 ఉద్యోగులు కిముడు కృష్ణవేణి,గణపతిరాజు మాట్లాడుతూ మూడు నెలల వేతనాలు అందకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబ పోషణ కష్టంగా ఉందని వాపోయారు. 104 సేవలను ప్రభుత్వం నిర్వహించడం కాకుండా, అరబిందో యాజమాన్యం నుంచి 104 ఉద్యోగులకు రావాలస్సిన బకాయిలను వసూలు చేసి అందజేయాలని వారు కోరారు. దీనిపై జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ 104 సిబ్బంది సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment