నిలకడగా జోలాపుట్టు నీటిమట్టం
ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరు అందించే ప్రధాన జోలాపుట్టు జలాశయంలో నీటి మట్టం నిలకడగా ఉంది. ఇటీవల మన్యంలో చెదురుమదురుగా కురిసిన వర్షాలకు వరద నీరు భారీగా చేరడంతో నీటిమట్టం క్రమేపీ పెరిగింది. ప్రాజెక్ట్ సాధారణ నీటి మట్టం 2750 అడుగులు కాగా గురువారం నాటికి 2747.60 అడుగులు నమోదయింది. గత ఏడాది ఇదే రోజుకు 2727.20 అడుగుల నీరు ఉండేది. గత ఏడాదితో పోలిస్తే 20 అడుగులు అధికంగా ఉంది. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం దిగువున్న డుడుమ జలాశయానికి ఒక గేట్లు ఎత్తి 13 వందల క్యూసెక్కులను గత రెండు రోజులుగా విడుదల చేస్తున్నారు. డుడుమ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2590 అడుగులు కాగా ప్రస్తుతం 2580.70 అడుగుల మే నీరు ఉంది.
డుడుమకు 13ంం క్యూసెక్కుల విడుదల
Comments
Please login to add a commentAdd a comment