టెన్త్ ఉత్తీర్ణతే భవిష్యత్తుకు తొలిమెట్టు
జిల్లావిద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు
కూనవరం: ప్రతి విద్యార్థికి జీవితంలో 10వ తరగతి తొలి మెట్టు అని మంచి మార్కులు సాధిస్తే వెనుదిరిగి చూసే పరిస్థితి ఉండదని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు సూచించారు. మండల పరిధిలోని పలు పాఠశాలలను మంగళవారం ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. దీనిలో భాగంగా స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, విజయసాధన, మాంటిస్సోరీ హైస్కూళ్లు, మర్రిగూడెం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా లేదా అని ఆరాతీశారు. మూడు నెలల నుంచి బియ్యం రావడంలేదని హెచ్‌ఎం చిచ్చడి అప్పారావు తెలిపారు. భోజన పథకం నిర్వాహకులే బియ్యాన్ని సమకూరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి బయ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మార్చిలో జరిగే పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు నిర్దేశించిన 100 రోజుల ప్రణాళిక వివరాలను ఆయన హెచ్‌ఎంల నుంచి తెలుసుకున్నారు. అనంతరం టెన్త్ విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. పలు ప్రశ్నలకు వారి నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ పర్యటనలో ఎంఈవో–2 లక్ష్మయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment