అవుట్ సోర్సింగ్ టీచర్ల సమస్యలు పట్టని ప్రభుత్వం
● రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిల పక్షం నేతలు ధ్వజం
● ఇప్పటికై నా పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక
పాడేరు రూరల్: గిరిజన సంక్షేమ గురుకులం పాఠశాల,కళాశాల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలు పరిష్కారంపై కూటమి ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని అఖిల పక్షం నేతలు శేషాద్రి, కేబీ పడాల్, శ్రీనివాస్ పడాల్, రామారావు దొర ధ్వజమెత్తారు. గురువారం వారు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై గిరిజన ఉద్యోగుల భవనం వద్ద ఆదివాసీ ఉద్యోగ, విద్యార్థి, ప్రజాసంఘాలతో ఏర్పడిన అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పాడేరు జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసన దీక్షలు 41వ రోజుకు చేరినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడం విచారకరమన్నారు. ప్రభు త్వ నిరంకుశ పాలనతో గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలు మరింత అధ్వానంగా మారా యని విమర్శించారు. ఇప్పటికై నా వారి ప్రధాన డిమాండ్ల ను పరిష్కరించకుంటే ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు ఏకమై ఉద్యమం మరింత ఉధృతం చేస్తా మని హెచ్చరించారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment