విశాఖతో మన్మోహన్‌కు అనుబంధం
సాక్షి, విశాఖపట్నం : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో గతంలో పలుమార్లు విశాఖలో పర్యటించారు. 2006 మే 20న స్టీల్ ప్లాంట్ విస్తరణ పనులకే ఆయనే శంకుస్థాపన చేశారు. 2008 జనవరి 2వ తేదీన తూర్పు నౌకాదళాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఐఎన్‌ఎస్ జలశ్వా యుద్ధనౌకలో పర్యటించారు. అనంతరం జలశ్వాలో విధులు నిర్వర్తిస్తున్న వారితో ఆన్ బోర్డుపై మన్మోహన్ కాసేపు ముచ్చటించారు. 2009 జూలై 26న సతీసమేతంగా విశాఖలో పర్యటించారు. ఆ సమయంలో భారత నౌకాదళంలో కీలకమైన జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్‌ని జాతికి అంకితం చేశారు. ఆయా సందర్భాల్లో ఆయనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment