డోలీలో గర్భిణి తరలింపు
కొయ్యూరు: డోలిమోతలు లేకుండా చేస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటిమీద రాతలుగా మారాయి. మండలంలోని డోలీలో రోగులను తరలించడమే ఇందుకు ఉదాహరణ. డౌనూరు పంచాయతీ ఉసిరికపాడుకు చెందిన గర్భిణి వంతల లక్ష్మికి మంగళవారం పురిటి నొప్పులు వ చ్చాయి. రహదారి పూర్తిగా లేకపోవడంతో ఉసరికపాడు నుంచి లక్ష్మిని భర్త భాస్కరరావు, బంధువులు ఐదు కిలోమీటర్ల దూరంలోని గుమ్మనిపాలెం వరకు డోలీలో మోసుకువచ్చారు. అక్కడ నుంచి వాహనంలో డౌనూరు ఆస్పత్రికి తరలించారు. రోడ్డు పను లు పూర్తి కాకపోవడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు వివరించారు. రహదారి మంజూరైనా పనులు పూర్తి చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment