విజ్ఞానయాత్రకు రాయపూర్ వెళ్లిన రైతులు
ముంచంగిపుట్టు: విజ్ఞానయాత్రకు ముంచంగిపుట్టు,పెదబయలు మండలాలకు చెందిన 17 మంది గిరిజన రైతులు మంగళవారం రాయపూర్ బయలుదేరి వెళ్లారు. జిల్లా వనరుల కేంద్రం,పాడేరు, విశాఖపట్నం ఆత్మ సౌజన్యంతో ఈ యాత్ర ఏర్పాటుచేశారు. ప్రత్యేక బస్సులో చత్తీస్‌గఢ్‌కు చెందిన రాయపూర్‌లోని ఇందిరా గాంధీ కృషి విశ్వ విద్యాలయానికి వెళ్లారు. చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ విధానం, కూరగాయ సాగులో యాజమాన్యం, నూతన వంగడాలపై అవగాహన పొందుతారని మండల వ్యవసాయాధికారులు విజయలక్ష్మి, శ్రీనివాసబాబు, లీలావతి తెలిపారు. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు రైతులతో పాటు వ్యవసాయ,ఉద్యాన సహాయకులకు శిక్షణ అందిస్తారని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment