12వేల మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు
సాక్షి,పాడేరు: ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థల సంయుక్త సహకారంతో ఫిబ్రవరి 8వ తేదీన 12వేల మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో వ్యాయామ ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 108 నిమిషాల్లో 108 సూర్య నమ స్కారాల ప్రక్రియ చేపడుతుండడం సంతోషంగా ఉందన్నారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో ప్రణవ్ సంకల్ప యోగ సమితి అధ్యక్షుడు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు విజయవంతంగా జరుగుతున్న ట్టు చెప్పారు. పాడేరు,జి.మాడుగుల, హుకుంపేట మండలాల్లోని ప్రాథమిక యోగా శిక్షణ పూర్తి చేసుకున్న 12వేలమంది గిరిజన విద్యార్థినీవిద్యార్థులతో ఈ సూర్యనమస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.యోగాను నిత్య సాధనగా ప్రతి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోనూ కొనసాగించాలని,దశల వారీగా అన్ని మండలాల్లో విస్తరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఇన్‌చార్జి డీడీ ఎల్.రజనీ,యోగా గురువు పతంజలి శ్రీని వాస్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇండియన్, ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థల నిర్వహణ
కలెక్టర్ దినేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment