న్యాయం చేసే వరకు ఆందోళన
జి.మాడుగుల: ఆశ్రమ పాఠశాల విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనను నిరసిస్తూ ప్రజాసంఘాలు, బాలిక తల్లిదండ్రులు స్థానిక గాంధీనగర్ ఆశ్రమ పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. గత నెల 25న విద్యార్థినిపై లైంగిక దాడి పాల్పడిన ఘటనపై ముగ్గురు వ్యక్తులపై స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాల యాజమాన్యంపై చర్యలు విద్యార్థిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మహిళా సంఘ ప్రతినిధులు లతాకుమారి, కెజియారాణి, విమల, రమణమ్మ, ,గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ డిమాండ్ చేశారు. లైంగిక దాడికి ఆశ్రమ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపించారు. న్యాయంకోసం తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే బాధిత విద్యార్థి, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనలో విచారణకు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేయాలని వారు కోరారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేసేవవరకు ఉద్యమం కొనసాగుతుందని వారు హెచ్చరించారు.
ప్రజాసంఘాలు, బాలిక తల్లిదండ్రులు హెచ్చరిక
లైంగిక దాడి ఘటనపై గాంధీనగర్ ఆశ్రమ పాఠశాల ఎదుట నిరసన
Comments
Please login to add a commentAdd a comment