స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి
జి.మాడుగుల: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గిరిజన ఉప ప్రణాళిక నిధుల సహకారంతో బిసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గిరిజన రైతులకు కోళ్ల గూళ్లను అనకాపల్లి జిల్లా, రాంబిల్లి, హరిపురం బీసీటీ కేవికే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి కోళ్ల పరిశోధన సంచాలనాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.వి.ఎల్.ఎన్.రాజు తెలిపారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి కోళ్ల పరిశోధన సంచాలయం(ఐసీఏఆర్‌డీపీఆర్) రాజేంద్రనగర్, హైదరాబాద్ ఆర్థిక సాయంతో సరియా గ్రామంలో శనివారం పద్మాపురం, తోకచిలక, బూసుపల్లి, కాయబండ, గొప్పలపాలెం, కృష్ణాపురం తదితర 15గ్రామాల్లో 100మంది గిరిజన రైతులకు కోళ్ల గూళ్లను ఆయన పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్నారు. జెనెటిక్స్ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ వనరాజ, గ్రామ ప్రియా రకాల కోళ్లు ఐసీఏఆర్‌డీపీఆర్‌లోనే అభివృద్ధి చేసినట్టు ఆయన వివరించారు. కోళ్లు పోషణ శాస్త్రవేత్త డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో కోళ్ల దాణా తయారీని వివరించారు. బిసీటీ కేవీకే పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ విజయరాజ్ఞి కోళ్లుకు వచ్చే రోగులు, నివారణపై అవగాహన కల్పించారు. బిసీటీకే సీనియర్ శాస్త్రవేత్త మాట్లాడుతూ డాక్టర్ శైలజ మాట్లాడుతూ కెవీకే అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిసీటీ కెవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్, ఐసీఏఆర్ డీపీఆర్ శాస్త్రవేత్తలు, ఎస్‌ఎల్‌ఎఫ్‌సీ సిబ్బంది, వార్డు నంబర్ నూకరాజు, గిరిజన రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment