‘పంచాయతీ టూ పార్లమెంట్’కు గిరిజన ప్రజాప్రతినిధులు
ఢిల్లీ బయలుదేరిన ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర తదితరులు
అరకులోయ టౌన్: ఢిల్లీలో ఈనెల 5,6 తేదీల్లో జరగనున్న పంచాయతీ టూ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నట్టు అరకులోయ జెడ్పీటీసీ శెట్టి రోషిణి తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి ఏడుగురు మహిళా ప్రజా ప్రతినిధులు వెళ్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి తనతోపాటు ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లి పల్లి సుభద్ర, చింతపల్లి ఎంపీపీ అనూషదేవి, పాడేరు, హుకుంపేట, మట్టం సర్పంచ్‌లు ఉషారాణి, వెంకటపూర్ణిమ, శాంతకుమారి, ముంచంగిపుట్టు ఎంపీటీసీ సుబ్బలక్ష్మి వెళ్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment