తూనికల్లో మోసగిస్తే కఠిన చర్యలు
తూనికల విభాగం డీసీ రవికుమార్
హుకుంపేట: వారపు సంతల్లో దళారులు, వ్యాపారులు తూనికల్లో గిరిజనులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా తూనికల విభాగం డీసీ రవికుమార్ హెచ్చరించారు. మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపుసంతలో గిరిజనుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే దళారి వ్యాపారుల తూనిక కాటాలను ఆయన తనిఖీ చేశారు.కాటాను రిమోట్ విధానంలో ఆపరేట్ చేయడాన్ని గుర్తించిన ఆయన వ్యాపారిపై ఆగ్రహానికి గురయ్యారు. ఎంతో కష్టపడి పండించిన గిరిజనులను మోసగించడం సరికాదని హెచ్చరించారు. మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment