అరకు ఉత్సవాలతో ఒరిగేదేమీ లేదు
పాడేరు రూరల్: అరకు ఉత్సవాలతో గిరిజనులకు ఒరిగేదేమీ లేదని గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఉన్న అనేక ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా అరకు ఉత్సవాల పేరుతో లక్షల రూపాయలు వెచ్చించి ఉత్సవాలు నిర్వహించడం అవసరమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాల్లో సౌకార్యలు లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్ధుల మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ,గ్రామల్లో తాగునీరు, రహదారి సౌకార్యం లేక డోలిమోతలతోనే ఆదివాసీ ప్రజలు గడుపుతున్నారన్నారు. ఇటువంటి అనేక రకాల ఇబ్బందులతో గిరిజనులు అల్లాడుతుంటే అరకులో ఉత్సవాలు నిర్వహించి పండుగా చేసుకోవడం సిగ్గుగా లేదా అన్నారు. ఉత్సవాలకు కేటాయించాల్సిన నిధులు గిరిజనుల అవసరాలకు కేటాయించడంలో ఎందుకు విఫలమైనట్టు ప్రశ్నించారు. నేటికి టూరిజం నుంచి వచ్చే నిధులను పంచాయతీ అభివృద్ధికి ఎందుకు వెచ్చిండం లేదని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల్లో జివో నంబర్ –3 లేక నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పాడేరు,చింతపల్లి, అరకులోయ, ప్రాతాల్లో పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి టూరిజం నుండి కోట్ల రూపాయలు నిధులు వస్తున్నా గిరిజన ప్రాంతాలు అభివృధికి ఎందుకు నిధులు కేటయించడం లేదన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలని డిమాండ్ చేశారు, నాయకులు లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment