దివ్యాంగ పింఛనర్లకు వైద్య పరీక్షలు
అనంతగిరి(అరకులోయటౌన్): ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా పింఛన్లు పొందుతున్న దివ్యాంగులకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతగిరి, ఎగువశోభ, కొత్తూరు సచివాలయాల పరిధిలో మంచానికే పరిమితమైన దివ్యాంగ పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి కేజీహెచ్ వైద్యులు సింహాచలం నాయుడు, విజయ్‌కుమార్, పాడేరు డీసీహెచ్ కృష్ణారావు, అనంతగిరి పీహెచ్‌సీ వైద్యాధికారి జ్ఞానేశ్వరి పరీక్షించారు. కొత్తూరుకు చెందిన గుద్దేల గంగులు, అనంతగిరికి చెందిన కమిడి మల్లేశ్వరరావు, కిల్లో గున్నమ్మ, ఎగువశోభకు చెందిన కె. ప్రవీణ్‌కుమార్‌లకు వైద్య పరీక్షలు జరిపి, వారి సదరం సర్టిపికెట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కార్యదర్శి దేవ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment