మారేడుమిల్లిలో టూరిజం చెక్‌పోస్టు | - | Sakshi
Sakshi News home page

మారేడుమిల్లిలో టూరిజం చెక్‌పోస్టు

Published Tue, Jan 7 2025 1:48 AM | Last Updated on Tue, Jan 7 2025 1:49 AM

మారేడుమిల్లిలో టూరిజం చెక్‌పోస్టు

మారేడుమిల్లిలో టూరిజం చెక్‌పోస్టు

మారేడుమిల్లి: జిల్లాలో ఎకో టూరిజంను మరింతగా అభివృద్ధి చేసి, గిరిజనులను భాగస్వాములను చేస్తామని అటవీశాఖ పీసీసీఎఫ్‌ చిరంజీవి చౌదరి తెలిపారు. మారేడుమిల్లిలో ఏర్పాటు చేసిన పర్యాటక చెక్‌పోస్టును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు ప్లాస్టిక్‌ సామగ్రి, పాలిథిన్‌ కవర్లు వినియోగించరాదని తెలిపారు. పర్యాటకులు టోల్‌గేట్‌ రుసుం చెల్లించాలన్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయంతో పర్యాటకాభివృద్ధికి మరింత కృషి చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సీసీఎఫ్‌ బి.ఎం.ఎన్‌.మూర్తి, డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌రెడ్డి, రంపచోడవరం సబ్‌ డీఎఫ్‌వో పి.అనూష, మారేడుమిల్లి రేంజర్‌ ఎం.ఏడుకొండలు, సీబీఈటీ రేంజర్‌ దావీదు, ఎఫ్‌ఎస్‌వో పట్టాభి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement