పురుషోత్తపట్నం రహదారి పరిశీలన
ఎటపాక: మండలంలోని పురుషోత్తపట్నంలో సెయింట్‌ఆన్స్ స్కూల్ నుంచి కె.ఎన్.పురం వరకు గల రహదారిని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ సోమవారం పరిశీలించారు. ఈపనులకు గత ప్రభుత్వ హయాంలో జెడ్పీటీసీ నిధుల నుంచి రూ.28 లక్షలు మంజూరయ్యాయి. పురుషోత్తపట్నం నుంచి ఎర్రబోరు మీదుగా రహదారి నిర్మాణానికి ఈ నిధులు సరిపోవని, అదనంగా నిధులు కేటాయించాలని ఇటీవల జెడ్పీటీసీ ఉబ్బా సుస్మిత.. పీవోను కోరారు. దీంతో స్పందించిన ఆయన రహదారిని పరిశీలించి, ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. గుండాల కాలనీ నుంచి కె.ఎన్.పురం వరకు మరో రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ,మాజీ ఎంపీపీలు ఉబ్బా సత్యం, గొంది బాలయ్య పీవోను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment