నేడు తారుమారు సంత
జి.మాడుగుల: మండల కేంద్రం జి.మాడుగులలో వెంకటరాజు ఘాట్ వద్ద మాజీ ఎంపీ, దివంగత మత్స్యరాస మత్స్యరాజు వంశీయులు పంట పొలాల్లో మంగళవారం తారుమారు సంత (పండగ సంత)నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ సంతను నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ. గ్రామ పెద్దలు, మాజీ ఎంపీపీ మత్స్యరాస వరహాలమ్మ,సన్యాసిరాజు, రామరాజు,నాగరాజు ఆధ్వర్యంలో సర్పంచ్ కిముడు రాంబాబు, సంత నిర్వహణ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment