నటి మీనాక్షి చౌదరి
సినీ నటి మీనాక్షి చౌదరి గురువారం నగరంలో సందడి చేశారు. జగదాంబ జంక్షన్‌లో ఆర్‌ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని మీనాక్షి తెలిపారు.
ఐదేళ్లలోవంద సినిమాల్లో నటించా
పాడేరు : ఐదేళ్లలో వంద సినిమాల్లో నటించానని, వీటి లో 15 సినిమాలు విడుదల కావాల్సి ఉందని సినీ నటుడు. ఉమ్మడి విశాఖ డ్వామా పూర్వ పీడీ సత్యసాయి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక కాఫీ హౌస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఆయన మాట్లాడారు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన గేమ్ చేంజర్, విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో కూడా తాను నటించినట్టు చెప్పారు. ఈ చిత్రాలు తనకు ఎంతో గుర్తింపు ఇవ్వనున్నాయన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 19 ఏళ్లు జెడ్పీ సీఈవో, డ్వామా పీడీ, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించినట్టు చెప్పారు. ప్రముఖ సినీ దర్శకుడు వంశీ దర్శకత్వంలో 2017లో సినీ రంగ ప్రవేశం చేశానన్నారు. ఇప్పటివరకు వంద సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినట్టు ఆయన తెలిపారు. పాడేరు, చింతపల్లి, అరకులోయ ప్రాంతాలు ఘాటింగ్‌కు ఎంతో అనువైనవని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment