సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
పాడేరు : ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్‌గౌడ్, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో పద్మాలతతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 52 వినతులను స్వీకరించారు. పలువురు జిల్లా స్థాయి అధికారులు మీకోసం కార్యక్రమానికి హాజరు కాలేదని గుర్తించిన కలెక్టర్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా మీ కోసం కార్యక్రమానికి గైర్హాజరైతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. పదేపదే వస్తునన ఫిర్యాదులపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ కొండయ్యపడాల్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమేష్‌కుమార్‌రావు, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా, ఐటీడీఏ ఏవో హేమలత, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ జవహార్‌కుమార్, జిల్లా ఖజానాధికారి ప్రసాద్‌బాబు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
మీకోసం కార్యక్రమానికి గైర్హాజరైతే షోకాజ్ జారీ చేస్తామని హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment