పాఠశాలల అభివృద్ధిలో కమిటీలు కీలకం
అడ్డతీగల: పాఠశాలల అభివృద్ధిలో యాజమాన్య కమిటీల (ఎస్‌ఎంసీలు) పాత్ర కీలకమని ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు అన్నారు. స్థానిక ఎమ్మార్సీలో శుక్రవారం పాఠశాల యాజమాన్య కమిటీల చైర్మన్లకు కమిటీల విధులు, బాధ్యతలు అనే అంశాలపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు అభివృద్ధి చెందాలంటే యాజమాన్య కమిటీలు నిత్య పర్యవేక్షణతో వారి పనితీరు మెరుగుపర్చుకున్నప్పుడే సాధ్యమౌతుందన్నారు. చైర్‌పర్సన్లు ఉపాధ్యాయులకు సహాయ సహకారాలు అందిస్తూ పాఠశాలల అభివృద్ధికి బాటలు వెయ్యాలన్నారు. ఆయా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ఆయన తెలుసుకున్నారు. పలు సమస్యలను ఆయన దృష్టికి వారు తీసుకువచ్చారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పలు అంశాలను వివరించారు. ఎంఈవో–2 పి.శ్రీనివాసరావు, డీఆర్పీలు, సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment