శిశు ఆధార్‌ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

శిశు ఆధార్‌ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోండి

Published Sat, Jan 4 2025 8:58 AM | Last Updated on Sat, Jan 4 2025 8:58 AM

శిశు ఆధార్‌ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోండి

శిశు ఆధార్‌ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోండి

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

సాక్షి,పాడేరు: జిల్లాలో విరించి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న శిశు ఆధార్‌ కేంద్రాల సేవలను తల్లిదండ్రులందరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ కోరారు. శుక్రవారం తన కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ప్రచార బ్యానర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సున్నా నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు కోసం ఈ ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పిల్లల ఆధార్‌ను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు.అన్ని ప్రాంతీయ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలలో శిశు ఆధార్‌ కేంద్రాల సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ జమాల్‌బాషా, విరించి సంస్థ ప్రతినిధులు మూర్త శ్రీను, గూడవల్లి ప్రదీప్‌కుమార్‌, ఉప్పు నాగేశ్వరరావు, శిశు ఆధార్‌ కో ఆర్డినేటర్‌ బీవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement