మన్యం వణుకుతోంది
చింతపల్లి: మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చలి, మంచు తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. ఆదివారం అరకువేలీలో 6.5 డిగ్రీలు, హుకుంపేటలో 7.4 డిగ్రీలు, పెదబయలులో 7.4 డిగ్రీలు, అనంతగిరిలో 8.6 డిగ్రీలు, చింతపల్లిలో 9.4 డిగ్రీలు, జి. మాడుగులలో 9.8 డిగ్రీలు, కొయ్యూరులో 12.9 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. మరియు వాతావర ణం విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి చలిగాలులు వీస్తుండటంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.
సింగిల్ డిజిట్‌కు..
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో చలిగాలులు కొనసాగుతున్నాయి.గత మూడు రోజుల నుంచి పాడేరు డివిజన్ వ్యాప్తంగా సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలితీవ్రత మరింత అధికమైంది.పొగమంచుతో పాటు చలితీవ్రతకు మన్యం వాసులు వణికిపోతున్నారు.సాయంత్రం నుంచే చలిగాలులు విజృంభిస్తున్నాయి. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డు వద్ద ఆదివారం 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కొనసాగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
అరకులో 6.5 డిగ్రీల నమోదు
Comments
Please login to add a commentAdd a comment