అన్నదమ్ముల కొట్లాట
ఇద్దరికి తీవ్రగాయాలు
అడ్డతీగల: మండలంలోని బడదాం గ్రామంలో శనివారం రాత్రి అన్నదమ్ముల మధ్య గొడవ కాస్తా కొట్లాటకు దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన చెదల రమణారెడ్డి, చెదల బాలురెడ్డి అన్నదమ్ములు. మద్యం సేవించి ఉన్న వీరిద్దరి మధ్య మాటామాట పెరిగి కొట్లాటకు దారితీసింది. అన్న రమణారెడ్డి తమ్ముడు బాలురెడ్డిని రాళ్లతో కొట్టాడు. అడ్డుకునేందుకు వెళ్లిన అతని భార్య రమణమ్మను కూడా రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. భార్యాభర్తలిద్దరు అపస్మారక స్థితికి చేరడంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు 108 వాహనంలో వారిద్దరిని స్థానిక సీహెచ్‌సీకి తీసుకువచ్చారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అడ్డతీగల సీఐ నరసింహమూర్తి పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment