సంక్రాంతి సంబరాలు
వలసంపేటలోప్రభుత్వ భూమి కబ్జా
కొయ్యూరు: మండలంలోని కినపర్తి పంచాయతీ వలసంపేట సమీపంలో ప్రభుత్వ భూమిని గిరిజనేతరుడు దర్జాగా ఆక్రమించినా రెవెన్యూ అఽధికారులు చర్యలు నామమాత్రంగా ఉండడంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పెదమాకవరం ఎంపీటీసీ సడ్డా మల్లేశ్వరి తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వలసంపేట సమీపంలో సర్వే నంబర్ 51–2లో4.94 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు.గతంలో పంచాయతీ సర్పంచ్‌తో సహా అందరూ తీర్మానం చేసి ఆక్రమణలు తొలగించాలని రెవెన్యూ అధికారులకు వినతిపత్రం ఇచ్చారన్నారు. దీనిపై అప్పట్లో రెవెన్యూ సిబ్బంది హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే ఇటీవల దానిని పక్కన పెట్టిన గిరిజనేతరుడు ఏకంగా ప్రభుత్వ భూమిలో పాకను వేశారని చెప్పారు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రెవెన్యూ అధికారులు స్పందించకుంటే త్వరలో ఆదివాసీ జేఏసీతో కలిసి రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు.
ఆరిలోవ (విశాఖ): నగరంలోని ఆరిలోవలో ఆదివారంఉత్తరాంధ్ర సంగీత జానపద కళాపీఠం ఆధ్వర్యంలో టీఐసీ పాయింట్ వద్ద సాయంత్రం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాలకు చెందిన కళాకారులను ఇక్కడకు తీసుకువచ్చారు. కూచిపూడి, భరతనాట్యం, కోలాటం, ఏకపాత్రాభినయం, గిరిజన కోలాటం, ధింసా నృత్యం, జముకుల కథ, సన్నాయి మేళం, రాజమ్మ ఆట, నాగిని డ్యాన్స్, తుడుము మేళం, ఒడిశా గిరిజన సంస్కృతి, చెంచు నాటకం, జానపద నృత్యాలు ప్రదర్శించారు.
ఫిర్యాదు చేసినా నామమాత్రంగా రెవెన్యూ అధికారుల చర్యలు
కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తా..:
పెదమాకవరం ఎంపీటీసీ మల్లేశ్వరి
Comments
Please login to add a commentAdd a comment