కుమార్తెను చూసి వస్తుండగా..
రంపచోడవరం: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తెను చూసి వస్తున్న తండ్రిని రోడ్డు ప్రమాదరూపంలో మృత్యువు కబళించింది. ఆ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెద గెద్దాడకు చెందిన వ్యవసాయ కూలీ పత్రి సతీష్‌రెడ్డి (30) కుమార్తె అనారోగ్యానికి గురై రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతోంది. ఆమెను చూసేందుకు శనివారం ఆస్పత్రికి వెళ్లాడు. రాత్రి అక్కడి నుంచి స్వగ్రామం పెద గెద్దాడ బైక్‌పై బయలుదేరాడు. ఎదురుగా వస్తున్న కారు లైటింగ్‌లో బైక్ అదుపు తప్పడంతో ప్రమాదానికి గురయ్యాడు. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ అదుపుతప్పడంతో తండ్రి దుర్మరణం
రోడ్డుపక్కన విద్యుత్ స్తంభాలను
ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి
పెద గెద్దాడలో విషాదఛాయలు
Comments
Please login to add a commentAdd a comment