సాక్షి,పాడేరు: విధుల పట్ల నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై జిల్లాలోని ఇద్దరు అంగన్‌వాడీ కార్యకర్తలను కలెక్టర్ దినేష్‌కుమార్ మంగళవారం సస్పెండ్ చేశారు. గూడెంకొత్తవీధి మండలం కొత్తవాడు గ్రామంలో బాలింత కిండేరి దీన మృతి చెందినప్పటికి టేక్ హోం రేషన్ ఆమె కుటుంబ సభ్యులకు పంపిణీ చేసిన బూరుగుపాలెం అంగన్‌వాడీ కార్యకర్త జి.రాజ్యలక్ష్మిపై ఆయన చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా కొయ్యూరు మండలం రెల్లలపాలెంలో బాలింత డూరి కృష్ణకుమారి మృతిచెందినప్పటికీ రేషన్‌ను బంధువులకు పంపిణీ చేయడంపై అంగన్‌వాడీ కార్యకర్తను సస్పెండ్ చేశారు. అలాగే హుకుంపేట మండలం ఉప్ప పీహెచ్‌సీ పరిధిలో మాతాశిశు మరణాలపై సంబంధిత వైద్యసిబ్బందికి నోటిసులు జారీ చేయాలని డీఎంహెచ్‌వోను కలెక్టర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment