పెండింగ్ నిర్మాణ పనులు పూర్తి చేయండి
● మార్చి నెలాఖరు వరకు గడువు ● కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం ● మాతాశిశు మరణాలు సంభవిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఇంజనీరింగ్ పనులను ఈఏడాది మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళళవారం తన కార్యాలయంలో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో రహదారులు, భవన నిర్మాణాలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 275, సీసీడీపీ, ఉపాధి హమీ పథకాల్లో మంజూరు చేసిన పనులన్నింటిని నిర్ణిత గడువులోగా పూర్తి చేయాలన్నారు.అరకు పరిధిలో 24పనులకు ఒకటి మాత్రమే పూర్తిచేశారని,మిగిలిన 23 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. చింతూరు,రంపచోడవరం డివిజన్‌ల పరిఽధిలో ఆర్టికల్ 275 పథకంలో మంజూరు చేసిన పనులు కూడా మార్చి నాటికి పూర్తి చేయాలని, పనులు ప్రారంభించని కాంట్రాక్టులను రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. పాడేరు గిరిజన సంక్షేమడివిజన్ పరిధిలో 66 పనులు మంజూరు చేయగా, 48పనులు పురోగతిలో ఉన్నాయని, మిగిలిన పనులు కూడా వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన సంక్షేమశాఖ ఈఈలు కె.వేణుగోపాల్, డేవిడ్‌రాజు, సీపీవో ఎన్‌ఎన్‌ఆర్‌కే పట్నాయక్, వర్చువల్‌గా రంపచోడవరం,చింతూరు డివిజన్‌ల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
మాతాశిశు మరణాలను ఉపేక్షించేది లేదు
మాతా శిశుమరనాలు సంభవిస్తే ఉపేక్షించేది లేదని, ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్‌కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జర్రెల, డౌనూరు. గెమ్మెలి, ధారకొండ, డుంబ్రిగుడ, ఆర్‌వీ నగర్, ఉప్ప ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన మాతృ మరణాలపై ఆయన సమీక్షించారు. గిరిజనులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. హైరిస్క్‌తో పాటు ఇతర గర్భిణులను ప్రసవ సమయానికి 10 రోజుల ముందుగానే బర్త్ వెయిటింగ్ హళ్లకు తరలించి సుఖ ప్రసవాలు జరిగేలా వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆశాలు, అంగన్‌వాడీలు, ఎఎన్‌ఎంలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆస్పత్రులలో ప్రసవాలు పెరిగేలా ప్రణాళికపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, జిల్లా సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వామిత్ర, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కృష్ణారావు, సీడీపీవోలు పాల్గొన్నారు.
జన్‌మన్ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం
జిల్లాలో ప్రధానమంత్రి జన్‌మన్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు.మంగళవారం తన కార్యాలయం నుంచి గృహనిర్మాణం, డీఆర్‌డీఏ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి హమీ పథకం పనులపై ఎంపీడీవోలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 23,654 గృహలు మంజూరు చేయగా, ఇప్పటికి 17,382 మాత్రమే ప్రారంభించారన్నారు. మిగిలిన 6272 ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని సూచించారు.అర్హత కలిగిన సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలన్నారు. సీ్త్రనిధి చెల్లింపుల్లో జాప్యం చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఉపాధి పథకంలో లేబర్ మొబలైజేషన్ పెంచాలని, ఉపాధి పనులు కల్పించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలంతా స్థానికంగా అందుబాటులో ఉండాలని, చిన్న పిల్లల ఆధార్ కార్డుల నమోదును విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు, వర్చువల్‌గా పాడేరు,రంపచోడవరం ఐటీడీఏ పీవోలు అభిషేక్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment