రిక్వెస్ట్ స్టాప్ వద్ద పాసింజర్ రైళ్లు ఆపాలి
సాక్షి,పాడేరు: అరకులోయ పట్టణ పరిధిలోని రైల్వే రిక్వెస్ట్ స్టాప్ వద్ద పాసింజర్ రైళ్లను నిలిపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్, అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణికి ఆటో కార్మికసంఘం నేతలు వినతిపత్రం అందజేశారు.వారంతా మంగళవారం పాడేరులో కలెక్టర్, ఎంపీలకు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. గత డిసెంబర్ 31వతేదీ వరకు రిక్వెస్ట్ స్టాప్ వద్ద పాసింజర్ రైళ్లను నిలిపారని, ఈఏడాది జనవరి ఒకటి నుంచి రైళ్లను నిలపకపోవడంతో తామంతా ఉపాధి కోల్పోతున్నామని వాపోయారు. పూర్వం నుంచి ఉన్న రైల్వే రిక్వెస్ట్ స్టాప్ వద్ద పాసింజర్ రైళ్ల నిలిపివేతను రద్దు చేయడం అన్యాయమని, స్థానిక ప్రజలు, పర్యాటకులకు కూడా ఇబ్బందిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైళ్లను నిలపడంతో పాటు ఫ్లైవోవర్, ప్లాట్‌ఫారంలను అభివృద్ధి చేయాలని వారు కలెక్టర్,ఎంపీలను కోరారు. విశాఖలోని రైల్వే డీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్, ఎంపీలు వారికి హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఆటో కార్మిక సంఘం నాయకులు రమేష్,చిన్న,ఎల్లారావు, బాషా, వసంత్,కృష్ణరాజు,శ్రీను,శంకర్,రామన్న పాల్గొన్నారు.
అరకు ఎంపీ, కలెక్టర్‌కు ఆటో కార్మిక సంఘ నేతల వినతి
Comments
Please login to add a commentAdd a comment