16 కిలోల గంజాయి స్వాధీనం
ఒడిశాకు చెందిన ఇద్దరు అరెస్టు
డుంబ్రిగుడ (హుకుంపేట): ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 16 కిలోల గంజాయిని హుకుంపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పామురాయి జంక్షన్ వద్ద ఎస్‌ఐ సురేష్ ఏపీ ఎస్పీ పోలీసులు, సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు. ఒడిశాలోని జయంతి గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులకు తనిఖీ చేశారు. వారి వద్ద గుర్తించిన 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు. నిందితులు చంద్రసేన్ మెహర్, జయదేవ్ మెహర్ ఒడిశాలోని కలహండి జిల్లా బల్దియామాల్ గ్రామానికి చెందినవారని ఆయన తెలిపారు. చిత్రకొండ బ్లాక్ అండిగల్ గ్రామంలో తెలిసిన వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి తీసుకువస్తుండగా పట్టుబడ్డారన్నారు. వీరు గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా కట్టి ఆటో డ్రైవర్లు, సంతల్లో అమ్ముతుంటారని, అందునిమిత్తం తీసుకువెళ్తున్నారని ఎస్‌ఐ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment